ముకుందా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పూజ హెగ్డే. ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే. టాప్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించటంపై తన అనుభవాలను వెల్లడించింది. ఇది ఇలా ఉండగా మొదట హృతిక్ రోషన్ సరసన ఓ సినిమాలో నటించింది..మొహెంజొదారో పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రాణి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో హృతిక్‌తో లిప్‌లాక్ చేసింది. చిత్రీకరణకు సంబంధించి తన అనుభవాలను వెల్లడించింది. `ముద్దు సీన్స్ ఆడియన్స్‌కు చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఆ సన్నివేశాల్లో నటించేందుకు తారలు ఎంతో ఇబ్బంది పడతారు. మొహెంజొదారో షూటింగ్ సమయంలో హృతిక్‌తో లిప్‌లాక్ ఉందని దర్శకుడు అశుతోష్ గోవరికర్ నాకు ముందే చెప్పారు. సీన్ ఇంపార్టెన్స్‌ను వివరించారు. నేను కూడా ఆ సీన్‌లో నటించేందు ప్రిపేర్ అయ్యా. కానీ తీరా షాట్ చిత్రీకరించే సమయంలో వణుకు వచ్చేసిందనీ పూజ వెల్లడించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురం లో సినిమాలో నటిస్తుంది..సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా జాన్‌లో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది పూజ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa