ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'కె.జి.యఫ్ చాప్టర్2'. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం చిత్రీకరణను జరుపుకుంటోంది. కన్నడ సినిమా చరిత్రలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం తొలి భాగం `కె.జి.యఫ్ చాప్టర్ 1' పాన్ ఇండియా చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. దీంతో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇందులో అధీర అనే పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. సినిమాను 2020 ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa