ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ఇలా అనడం బాగోలేదు అంటున్న రాశి ఖన్నా!

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 09, 2020, 03:49 PM

విజయ్ దేవరకొండ లాస్ట్ లవ్ స్టోరీ అని ఇచ్చిన స్టేట్మెంట్ చూసి హీరోయిన్స్ కలవరపాటుకు గురవుతున్నారు. విజయ్ దేవరకొండ తో నటించాలని చాలామంది హీరోయిన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అది విజయ్ లవ్ స్టోరీస్ చేస్తేనే సాధ్యమవుతుంది. అదే మాస్ హీరోగా మారితే... అందరి ఫోకస్ విజయ్ దేవరకొండ మీదే ఉంటుంది కానీ.. హీరోయిన్స్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. అదే లవ్ స్టోరీస్ చేస్తే విజయ్ తో పాటుగా తమకి పేరొస్తుంది. లాస్ట్ లవ్ స్టోరీ అంటూ షాకివ్వగానే ముందు ఆ సినిమా హీరోయినే రాశి ఖన్నానే తప్పుబడుతుంది. అభిమానులు, ప్రేక్షకులు విజయ్ ని ఇంకా ప్రేమ్ కథ చిత్రాల్లో చూడాలనుకుంటున్నారని... కానీ విజయ్ ఇలా అనడం బాగోలేదని.. అయితే విజయ్ ముందుముందు లవ్ స్టోరీస్ చేయడంపై పునరాలోచిస్తాడనే నమ్మకం తనకుందని అంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa