సమంత పెళ్లి తర్వాత చేసిన సినిమాల్లో హీరోలను తొక్కేసి మరీ నట విశ్వరూపం చూపిస్తుంది. మజిలీ సినిమానే తీసుకోండి సమంత సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చేవరకు సినిమాపై ఓ ఫీల్ లో ఉన్న ప్రేక్షకుడు సమంత ఎంట్రీ తో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. చైతు ఎంతగా నటించిన సమంత ముందు తేలిపోయాడు. అంతలాంటి శ్రావణి పాత్రలో సమంత ఇరగదీసింది. ఇక యు టర్న్ అంతే. రాహుల్ రవీంద్ర ప్రేక్షక పాత్రే. అలాగే ఓ బేబీ సినిమాలోనూ నాగ శౌర్య కూడా డమ్మీనే. తాజాగా శర్వా తో కలిసి నటించిన జానూ సినిమాలో శర్వా ఓ మెట్టు సమంత పైనే ఉన్నప్పటికీ.. ఎక్కువగా సమంతానే ఫోకస్ అయ్యింది. జానూ టైటిల్ పాత్రలో సమంత ఇరగదీసింది. మరి సమంత పెళ్లి తర్వాత చేసే పాత్రలతో హీరోలను ఓ తొక్కు తొక్కి వదిలిపెడుతుందన్నమాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa