ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న వరల్డ్ ఫేమస్ లవర్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 12:24 PM

దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్యరాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా తెరకెక్కించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీపై యూత్ లో మహా క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ చిత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఒక్క హైదరాబాద్ సిటీ నందు 190 షోలకు గాను బుక్ మై షో నందు ఇప్పటికే 120 షోలు ఫుల్ అయిపోయాయి. ఇంకా మిగిలిన షోస్ కూడా త్వరితగతిన బుకింగ్స్ జరుపుకుంటున్నాయి. ఈ చిత్రంలోని పాటలు, టీజర్స్ మరియు ట్రైలర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. నలుగురు అమ్మాయిలతో వివిధ నేపధ్యాలతో విజయ్ రొమాన్స్ జరుపుతున్నాడు.ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa