ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్ళీ బన్నీ రికార్డ్స్ తో దున్నేయడం ఖాయమా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 12:42 PM

తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన  'అల వైకుంఠపురంలో' మూవీ ఊహించిన దానికి మించిన విజయం కట్టబెట్టింది. ఇదే జోష్ లో బన్నీ తన తదుపరి చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. బన్నీ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఐతే ఈ చిత్రంలో బన్నీ రోల్ భిన్నంగా మాస్ అండ్ డీగ్లామర్ రోల్ కానుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తికాగా సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఈ ఏడాది దసరా బరిలో ఈ చిత్రం దిగనుందని తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం 2020లో విడుదలై మళ్ళీ బన్నీ రికార్డ్స్ దున్నేయడం ఖాయం అని చెప్పుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రశ్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa