ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసుపులేటి మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 05:06 PM

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైన ఆయనను ఆదివారం వనస్థలిపురం లోని మెడిసిన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మంగళవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రిక, శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికలలో పసుపులేటి పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని నేటి యంగ్ హీరోల వరుకు అందరినీ ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఆయనకుంది. పసుపులేటి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సినియర్ జర్నలిస్టుగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకెంతో ఇష్టమని అన్నారు. అయన మరణం నన్ను ఎంతో భాదేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.. పసుపులేటి కుటుంబానికి అండగా ఉంటానని చిరంజీవి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa