కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడనీ, ఆ పాత్ర నిడివి 30 నిమిషాలకి పైగా ఉంటుందని అంటున్నారు. ఆయన సరసన నాయిక పాత్ర కూడా ఉంటుందనీ, ఆ పాత్ర కోసం అన్వేషణ సాగుతుందని చెప్పారు.
చరణ్ జోడీగా సమంతను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. 'రంగస్థలం' సినిమాతో చరణ్ - సమంత జంటకు మంచి క్రేజ్ పెరిగింది. అభిమానులంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేశారు. అందువల్లనే చరణ్ సరసన సమంతను కొరటాల ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇక చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో ఆమె జాయిన్ కానుందని అంటున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa