ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ మూవీలో విలన్ ఆయనేనా ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2020, 11:08 AM

ప్రభాస్ లేటెస్ట్ మూవీ దర్శకుడు రాధా కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్ర తాజా షెడ్యూల్ మొదలుకాగా ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ నందు చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పీరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు ఓ విభిన్నమైన విలన్ రోల్ చేస్తున్నారట. ఆయన పాత్ర ఈ చిత్రంలో ప్రత్యేకంగా నిలవనుంది సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.1960 ల నాటి పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సినిమా ప్రధాన భాగం యూరప్ నేపథ్యంలో నడుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa