దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న ‘క్రాక్’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. గత వారం చీరాలలోని రామాపురం బీచ్ లో ఈ చిత్రం సాంగ్ షూటింగ్ జరుపుకుంది. కాగా క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే తమన్ సాంగ్స్ తో పాటు షూట్ చేసిన సీన్స్ కు సంబధించిన నేపథ్య సంగీతం మీద వర్క్ మొదలుపెట్టారట. అవుట్ ఫుట్ చాల బాగా వస్తోందని. తమన్ నుండి మరో సూపర్ హిట్ ఆల్బమ్ రాబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa