2015లో అఖిల్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటికీ మూడు సినిమాలు పూర్తిచేసాడు , కానీ వాటి ఫలితం మాత్రం నిరాశ పరుస్తూనే వచ్చింది . ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా ముగింపు దశలో ఉండగానే తదుపరి ప్రాజెక్టును అఖిల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. 'సైరా' తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. దాంతో అఖిల్ కి కథ వినిపించి ఓకే అనిపించుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా గురించి త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa