ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నారప్ప" మూవీలో రెబా మోనికా జాన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 12:07 PM

వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు, కలైపులి థాను కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని 'రెడ్ డిసర్ట్'లో జరుగుతోంది. కీలకమైన కొన్ని పోరాట సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ప్రియమణి నటిస్తోంది. మరో కథానాయికగా 'రెబా మోనికా జాన్'ను తీసుకున్నారు.


మలయాళంలో 'రెబా మోనికా జాన్' కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానుంది. వెంకటేశ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఆమెపై చిత్రీకరించనున్నారు. చక్కని కనుముక్కుతీరు  .. ఆకర్షణీయమైన రూపం రెబా సొంతం. 'నారప్ప' విజయవంతమైతే ఈ సుందరి ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగానే వున్నాయి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa