ఒక అభిమాని 'ఆర్.ఆర్.ఆర్' అప్డేట్ ఎప్పుడని ట్విట్టర్ లో ట్వీట్ చేయగా మార్చికి అప్డేట్ వస్తుంది వెయిట్ చేయండంటూ 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర బృందం రిప్లై ఇచ్చింది. మార్చి 27 న రామ్ చరణ్ బర్త్ డే కాబట్టి.. ఆ రోజు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ లుక్ రివీల్ కావడం పక్కా అంటూ మెగా ఫాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ లుక్ పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ ఈ మధ్య బయట కూడా ఎక్కడా కనపడడం లేదు. ఎన్టీఆర్ బర్త్ డేకి మరో రెండు నెలలు సమయం ఉంది. మరి చరణ్ లుక్ విడుదల చేసి అప్పటి వరకు ఎన్టీఆర్ లుక్ విడుదల చేయకపోతే ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa