ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంతకుమించి ఏమీ అడగలేను: అసిన్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 04:26 PM

ముంబయి: టాలీవుడ్‌లో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్‌. 2016 జనవరి 19న మైక్రోమ్యాక్స్‌ సహవ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మను వివాహం చేసుకున్నారు. 2017 అక్టోబర్‌ 24న వీరిద్దరికీ పండంటి ఆడపిల్ల జన్మించింది. అసిన్‌కి వివాహమై నేటికి రెండేళ్లు కావొస్తుండడంతో తన కుమార్తె తొలి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌‌ చేశారు.


పాప కాలి బొటన వేలికి వజ్రాలతో తయారుచేసిన రింగుని తొడిగి ఉన్న ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘మా పెళ్లి జరిగి రెండేళ్లవుతోంది. ఇప్పుడు మేం ముగ్గురం. మూడో ఏడాదిలో అడుగుపెడుతున్నాం. ఆ దేవుడిని ఇంతకు మించి ఇంకేమీ అడగలేను.’ అని అసిన్‌ పేర్కొన్నారు. అసిన్‌కు పాప పుట్టిన తరువాత మొదట ఎత్తుకున్న వ్యక్తి బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌. అక్షయ్‌, అసిన్‌ ‘ఖిలాడి 786’ చిత్రంలో జంటగా నటించారు. ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతేకాదు..అసిన్‌ రాహుల్‌ని పెళ్లిచేసుకోబోతున్నట్లు ముందు అక్షయ్‌తోనే చెప్పారట.


తెలుగులో ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘లక్ష్మీనరసింహ’, ‘ఘర్షణ’, ‘చక్రం’, ‘గజిని’ తదితర సినిమాల్లో అసిన్‌ నటించారు. అసిన్‌ ఆఖరిగా 2015లో వచ్చిన ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆమె అభిషేక్‌ బచ్చన్‌కి జోడీగా నటించారు. పెళ్లైన తరువాత ఆమె‌ సినిమాలకు దూరమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa