ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేశ్ హీరోయిన్ టాప్‌లెస్ పోజు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 04:57 PM

కృతీ సనన్.. తెలుగులో ఒకటీ రెండు సినిమాలు చేసింది.. అవి కూడా పెద్ద సినిమాలే. మహేశ్ బాబుతో ‘వన్- నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్ గా కీలకమైన పాత్రను సమర్థవంతంగా పోషించింది ఈమె. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచెయ్’లో కూడా తన ప్రతిభను చాటింది కానీ.. ఆ తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ రెండు సినిమాలూ అంతగా హిట్ కాకపోవడంతోనేనేమో అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు కొదవలేదు.కింగ్ ఖాన్ షారూక్ సినిమా ఒకదాంట్లో నటించిన ఈమె.. ఆ తర్వాత వివిధ సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈమె ప్రముఖ ఫొటో గ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్ కోసం ఒక హాట్ పోజునే ఇచ్చింది. టాప్ లెస్ గా మారిపోయింది. కౌబాయ్ క్యాప్ తో అందాలను కవర్ చేసుకున్నట్టుగా ఇచ్చిన ఈ పోజు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో డబూ రత్నానీ వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. వీటిల్లో ఒక్కో పోజూ ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్ జనాల్లో బాగా ఫేమస్ అయిన డబూ రత్నానీ క్యాలెండర్స్ లో వరసగా మూడో ఏడాది ఈ కృతీకి స్థానం లభించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa