ఒక్క మనసుతో ఒక్క సినిమాకే టాలీవుడ్ లో బ్రేక్ పడినా మెగా డాటర్ నీహారిక తన టాలెంట్ ని కోలీవుడ్ లో ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. తాను చేస్తున్న మొదటి తమిళ సినిమా 'ఒరు నల్ల నాల్ పాత్రు సోల్రెన్' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యే తన సోషల్ మీడియా ఎకౌంటులో దీనికి సంబంధించిన పిక్స్ షేర్ చేసుకుంటున్న నిహారిక సినిమా మీద మంచి ఆసక్తినే రేపుతోంది. పైన మీరు చూస్తున్న పిక్ ఆ సినిమా లోనిదే. విచిత్రమైన గెటప్స్ తో కథ ఏమై ఉంటుందా అనే క్లూ ఇవ్వకుండా చాలా తెలివిగా ప్రమోషన్ చేస్తున్న ఈ మూవీపై తమిళ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటించడం దీనికి అసలు కారణం. కొండజాతి నాయకుడు యమన్ గా చాలా కొత్తగా ఆ పాత్ర ఉంటుందట. మరో హీరోగా సీనియర్ నటుడు ఘర్షణ ఫేం కార్తీక్ అబ్బాయి గౌతం కార్తీక్ కూడా నటిస్తున్నాడు. అతనిది కాలేజీ స్టూడెంట్ పాత్ర.
గౌతం కార్తీక్ మనవాళ్ళకు కూడా పరిచయమే. మణిరత్నం 'కడలి' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు అది కాస్త సూపర్ డిజాస్టర్ కావడంతో తెలుగు వాళ్ళకు రిజిస్టర్ కాలేదు. నీహారిక ఇందులో గౌతం కార్తీక్ సరసన కనిపిస్తుందా లేక విజయ్ సేతుపతి జంటగా నటించిందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అర్ముగ కుమార్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. పూర్తి తమిళ్ ఫ్లేవర్ లో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు డబ్బింగ్ చేసే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 2న తమిళ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ హిట్ అయితే మటుకు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పైన పిక్ ని బట్టి చూస్తే కథ అధిక శాతం అడవి ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తోంది. నీహారిక పాత్ర కూడా ఊహించని రీతిలో ఫాంటసీ తరహాలో ఉంటుందని టాక్. ఈ స్టిల్ లో నల్లని దుస్తులు వేసుకుని పైన వాడి కొమ్ములు పెట్టుకోవడం చూస్తే యమలోకం నుంచి మనుషులను తీసుకెళ్ళే దూత వచ్చినట్టే ఉంది కదూ. తనను తాను ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉన్న నీహారిక ఫస్ట్ సక్సెస్ దక్కుతుందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa