అహ్మదాబాద్: పద్మావత్‌ను ఇంకా వివాదాలు వెంటాడుతుండగా.. ఈ సినిమాను గుజరాత్ వ్యాప్తంగా ప్రదర్శించలేమని ఆ రాష్ట్ర మల్టీప్లెక్స్ అసోషియేషన్ డైరక్టర్ రాకేశ్ పటేల్ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యం భయపడుతుందని అందుకే విడుదల చేయలేమని తెలిపారు.
ఈ సినిమాను ప్రదర్శిస్తే వచ్చే నష్టాలను తామెందుకు భరించాలని ఈ సందర్భంగా రాకేశ్ పటేల్ ప్రశ్నించారు. దీంతో రిలీజ్‌కు సిద్ధమౌతున్న పద్మావత్‌కు థియేటర్ యాజమాన్యల నుంచి చుక్కెదురైనట్లైంది. మరి ఈ సమస్యను చిత్ర యూనిట్ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa