జయాపజయాల సంగతి అటుంచితే మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా తరువాత 'రాక్షసుడు' దర్శకుడు రమేశ్ వర్మతో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆ వెంటనే నక్కిన త్రినాథరావుతో మరో ప్రాజెక్టులో భాగం కానున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట ప్రారంభించిన చిత్రయూనిట్.. తమన్నాను తీసుకోవాలని ఫిక్సయిందట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రవితేజతో నటించేందుకు తమన్నా సుముఖంగా ఉన్నట్లు టాక్. గతంలో ఈ జోడీ 'బెంగాల్ టైగర్' సినిమాలో నటించింది. సో.. మళ్ళీ అదే జోడీ, అదే జోష్ రిపీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో రవితేజ లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని, తమన్నా పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తివివరాలు ప్రకటించనున్నారు.టీవలే F2 మూవీలో వరుణ్ తేజ్ సరసన స్టెప్పులేసి మిల్కీ బ్యూటీ.. ఈ ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' పార్టీ సాంగ్ తో శుభారంభం ఇచ్చింది. ఈ పాటతో తమన్నా వేసిన స్టెప్స్ ప్రేక్షకలోకాన్ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ సినిమాకే మేజర్ అసెట్‌గా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa