ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ అబ్బవరం జోడీగా ప్రియాంక జవాల్కర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 31, 2020, 10:56 AM

తెలుగు తెరకి 'టాక్సీవాలా' సినిమాతో ప్రియాంక జవాల్కర్ పరిచయమైంది. తన నాజూకు సౌందర్యంతో ఈ సుందరి యూత్ హృదయాలను పట్టేసింది. 'టాక్సీవాలా' హిట్ కావడంతో ఈ అమ్మడు బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో అలా జరగలేదు. అభిమానులు మరిచిపోతున్న సమయంలో ఈ అమ్మాయి తెలుగులో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది.'రాజావారు రాణిగారు' సినిమాతో పరిచయమైన కిరణ్ అబ్బవరం హీరోగా ఒక సినిమా లాంచ్ అయింది. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాతో, శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఎస్ ఆర్ కల్యాణ మంటపం ఈస్ట్ 1975' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఓ కల్యాణ మంటపం చుట్టూ తిరిగే కథ ఇది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో, సాయికుమార్ .. తులసి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa