ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి స్టార్ మా ఛానెల్‌లో బిగ్‌బాస్ 3 షో..

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 31, 2020, 11:35 AM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలకు కరోనా వైరస్ అనే మహామ్మారి కంటి మీద కులుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం గుప్పట్లోకి వెళ్లిపోయింది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే కదా. దీంతో ఇండ్లలో ఉన్న వారి కాలక్షేపం కోసం 30 ఏళ్ల క్రితం ప్రజలను అలరించిన రామాయణం, మహా భారతం సీరియల్స్‌ను  దూరదర్శన్‌లో పున: ప్రసారం చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇదే విధంగా ఇళ్లలో ఉండి టైమ్‌పాస్ కానీ వాళ్ల కోసం స్టార్ మా యాజమాన్యం ప్రేక్షకులకు ఎంటర్టేన్ చేయడానికి నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 సీజన్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నట్టు ప్రకటించారు.ఈ సోమవారం నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 మెమోరీస్‌ను ప్రసారం చేయనున్నట్టు స్టార్ మా ట్విట్టర్‌లో వెల్లడించింది. 21 రోజుల లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నట్టు అనుభూతి పొందుతున్నారు. అందుకే బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో జరిగిన ఎపిసోడ్స్‌ను కుదించి ప్రసారం చేయనున్నారు. ఈ సీజన్‌లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు. మరోవైపు శ్రీముఖి రెండో ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే కదా.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa