ఎంత పెద్ద హీరో అయినా ఎంత స్టార్ డైరెక్టర్ అయినా ... ఎంత భారీ రెమ్యూనరేషన్ అయినా.. మాకు నచ్చితేనే సినిమా చేస్తామంటున్నారు హీరోయిన్లు. స్టార్ హీరో అవ్వొచ్చు, తోపు డైరెక్టర్ అవ్వొచ్చు, అదిరిపోయే రెమ్యూనరేషన్ ఆఫర్ ఇవ్వొచ్చు. అయినా సరే మాకివన్నీ అవసరంలేదంటున్నారు. ఎంత పెద్ద సినిమా ఛాన్స్ వచ్చినా.. సినిమా చూస్తున్న రెండున్నర గంటలూ తెరపై నువ్వే కనిపిస్తావని ఛాన్స్ వచ్చినా.. ఆ పాత్రకు న్యాయం చెయ్యలేనప్పుడు సినిమా చెయ్యకూడదని చెబుతున్నారు అమలాపాల్ , రష్మిక, కియారా.ఏ పాత్ర కోసం అడిగినా ఆ పాత్రకు జస్టిఫికేషన్ చెయ్యలేకపోతే.. అలాంటి సినిమాలు చెయ్యకపోవడమే ఉత్తమం అంటోంది రష్మిక. ఎందుకంటే.. జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. షాహిద్ కు జంటగా రష్మికను అడిగితే.. జెర్సీలో హీరోయిన్ పాత్రకు చాలా ఎమోషన్స్ ఉంటాయని.. అన్ని ఎమోషన్స్ నేను పండించలేనని.. అందుకే ఆ క్యారెక్టర్ కి నో చెప్పానని ఫ్రాంక్ గా చెప్పింది రష్మిక.లేటెస్ట్ గా అమలాపాల్ కూడా ఇలా తను న్యాయం చెయ్యలేననుకున్న క్యారెక్టర్ కు నో చెప్పింది. మణిరత్నం.. సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా వద్దనుకుంటారా.. కానీ అమలా పాల్ చేతులారా అవకాశాల్ని వదిలేసుకుంది. ప్రస్తుతం మణి తెరకెక్కిస్తున్న పొన్నియున్ సెల్వన్ సినిమా లో ఆఫర్ ఇస్తే.. ఆ పాత్రకు నేను న్యాయం చెయ్యలేనని మర్యాదగా చెప్పేసింది.ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న క్రేజీ హీరోయిన్ కియారా కూడా అంతే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ.. మిగతా హీరోయిన్లకి ఛాలెంజ్ చేస్తున్న ఈ భామ.. నేను చెయ్యగలను అన్న నమ్మకం ఉంటేనే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. లేకపోతే ఎంత పెద్ద హీరో, డైరెక్టర్ అయినాసరే ఆ సినిమా నుంచి తప్పుకుంటాను అని తెగేసి చెబుతోంది. ఇలా పైసలకోసం కాకుండా పాత్రకు, పర్ ఫామెన్స్ కి ప్రాధాన్యం ఇచ్చే నటులనే ఆడియన్స్ కూడా ఆదరిస్తారు . అందుకే వీళ్లని కూడా అంతటి స్టార్లను చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa