ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపిక, రణ్‌వీర్ విరాళం..

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 10:08 PM

కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొస్తున్నారు. సినీ రంగానికి చెందిన పలువురు ఇప్పటికే పీఎం-కేర్స్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా బాలీవుడ్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే కూడా పీఎమ్-కేర్స్‌కు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఎంత ఇస్తున్నామనే విషయాన్ని వారు వెల్లడించలేదు. `ఇలాంటి సమయంలో చేసే చిన్న సహాయానికి కూడా చాలా విలువ ఉంటుంది. పీఎం కేర్స్ ఫండ్‌కు మా వంతు సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. మనమంతా ఐకమత్యంగా ఉండి ఈ సమస్య నుంచి బయటపడదాం.. జైహింద్` అంటూ రణ్‌వీర్ ట్వీట్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa