ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్‌ పై యాంకర్‌ అనసూయ ఫైర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 05, 2020, 10:35 AM

ఓ నెటిజన్‌పై యాంకర్‌ అనసూయ సీరియస్‌ అయింది. తాజాగా ఆమె ట్విట్టర్‌లో అభిమానులతో ఛాటింగ్‌ చేసి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ చేశారట కదా? అని ఓ నెటిజన్‌ అడిగాడు. ఈ 'అట' అనే పదాలు మీరు సరదాకి అనుకుంటే బాగుంటుందేమోనని అనసూయ సమాధానమిచ్చింది. అయితే, నిజాలు వేరే ఉంటాయని, పరిణతి చెందితే నీకు కూడా అర్థమవుతుంది.. అని ఆమె మండిపడింది. తనకు తెలిసి ఆ నెటిజన్‌ ఇంకా పరిణతి చెందలేదని పేర్కొంది.తన చేతిపై ఉన్న టాటూకి అర్థం ఏమిటి? అని ఓ నెటిజన్ అడగగా, అను సమాధానం చెబుతూ, 'బ్యూటీ సోల్ డీప్‌' అని తెలిపింది. అనసూయ అన్నది తమ నానమ్మ పేరని, అందుకే తనకు ఆ పేరు పెట్టారని చెప్పింది. తమ స్వస్థలం నల్గొండ అని తెలిపింది. జబర్దస్త్‌లో తన కొత్త ఎపిసోడ్స్‌ లేవని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa