ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ స్టైలిష్ స్టార్ మధ్య ఫైట్ ఇంతకీ ఏ విషయంలో ?

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 05, 2020, 10:47 AM

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే ఎన్టీఆర్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను చినబాబు, కళ్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని ఈ సినిమాను ప్లాన్ చేసింది చిత్రబృందం. అందులో భాగంగా నిర్మాతలు తమ సినిమాను మూవీ ప్రకటన రోజే 2021 ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా విడుదల చేస్తామంటూ చెప్పడం జరిగింది. మరోవైపు బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే అనుకున్న ప్రకారం ఈ సినిమా 2020 చివర్లో విడుదల చేయాలని సుకుమార్ భావించాడు. కానీ కరోనా వైరస్ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది. అంతేకాదు మరో నెల వరకు కూడా ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఏలాగు అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయలేము అని భావించిన చిత్రబృందం నిదానంగా సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్ లో విడుదల చేయాలని ఆలోచిస్తోందట. ఇదే కనుక జరిగితే 2021 సమ్మర్‌లో బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్, బన్నీలు పోటీ పడడం ఖాయం కనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa