ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ ఆర్ ఆర్'లో కీలక మార్పు...

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 01:02 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఉగాది సందర్భంగా కీలక ప్రకటన వెలువడనుంది.ఈ సినిమా ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. చరణ్ - అలియా భట్, ఎన్టీఆర్ - ఒలీవియా కాంబినేషన్లోని సీన్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలిపోయిందట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో ఒలీవియా ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఇప్పట్లో ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదు. ఒలీవియా లండన్ ఆర్టిస్ట్ .. అందువలన ఆమెకి ఇక్కడికి వచ్చే అవకాశాలు తక్కువనే అంటున్నారు. అలియా భట్ ముంబై కనుక, ఆమె వలన పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఇప్పటికే షూటింగు ఆలస్యం అయింది కనుక, లాక్ డౌన్ కారణంగా ఒలీవియా లండన్ నుంచి రాలేని పరిస్థితులు వుంటే, ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ఒక టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa