ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్న అల్లరి నరేషే

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2020, 12:49 PM

టాలీవుడ్ లో కామెడీ హీరో అంటే అల్లరి నరేషే. రాజేంద్రప్రసాద్,అలీ, నరేష్ వంటి సీనియర్ కామెడీ హీరోలు ప్రాభవం కోల్పోయాక, వెండితెర హాస్య ప్రియుల దాహం తీర్చిన హీరో అల్లరి నరేష్. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న ఈ వి వి సత్యనారాయణ గారి చిన్నకుమారుడైన నరేష్, నటుడు దర్శకుడు రవిబాబు డైరెక్షన్ లో 2002 లో వచ్చిన అల్లరి చిత్రంతో వెండితెరకు పరిచమయ్యారుతెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ తనదైన ముద్ర వేశాడు. ఆయన చేసిన 'బంగారు బుల్లోడు' ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. ఇక 'నాంది' చిత్రం ఇంకా చిత్రీకరణను పూర్తిచేసుకోవలసి వుంది. లాక్ డౌన్ త రువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలుకానుంది.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .. 'నాంది' చిత్రం నా కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా నాకు తప్పకుండా మంచి హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. హీరోగా మళ్లీ నేను బిజీ అవుతాననే నమ్మకం ఏర్పడింది. మొదటి నుంచి ఎక్కువగా హాస్య పాత్రలు చేస్తూ రావడం వలన, ఇతర ముఖ్యమైన పాత్రలకు ఎవరూ పిలవడం లేదు. కానీ నాకు నెగెటివ్ కేరక్టర్లు చేయాలని కూడా వుంది. అంతేకాదు వెబ్ సిరీస్ లలోను నటించడానికి నేను సిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చాడు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa