ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ఫ్యాన్స్ కీ క్రిష్ ఛాలెంజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2020, 02:54 PM

లాక్‌డౌన్ వేళ 'బీ ద రియల్ మ్యాన్' చాలెంజ్‌ ఇప్పుడు విస్తృతంగా సాగుతుంది. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను ఇప్పుడు పలువురు స్వీకరించడమే కాక తమ ఫ్రెండ్స్‌కి విసురుతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో అందరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి.. ఇంట్లో వాళ్లకు ఇంటి పనుల్లో తోచిన సాయం చేయమని చెప్పడమే ఈ చాలెంజ్ ఉద్దేశ్యం ఆ తర్వాత తారక్, రామ్ చరణ్‌, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్, అలాగే తన పెద్దన్న ఎమ్.ఎమ్. కీరవాణిలను నామినేట్ చేశారు. వారంతా ఈ ఛాలెంజ్ స్వీకరించి మరికొందరినీ ఈ ఛాలెంజ్‌కు ఆహ్వానించారు. ఇప్పుడు కీరవాణి విసిరిన ఛాలెంజ్‌ను డైరెక్టర్ క్రిష్ స్వీకరించడమే కాకుండా.. తనవంతుగా ఈ ఛాలెంజ్‌ను మరింత పెద్ద లెవల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.తాజాగా కీరవాణి ఇచ్చిన టాస్క్‌ని పూర్తి చేసిన క్రిష్.. ఆ టాస్క్ తాలూకూ వీడియో పోస్ట్ చేసి.. ''కీరవాణిగారూ మీరిచ్చిన టాస్క్ పూర్తి చేశాను. ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్‌కు ప్రపంచంలోని పవన్ కల్యాణ్ అభిమానులందరినీ నామినేట్ చేస్తున్నాను. 'బీ ద రియల్ మేన్‌' సవాలును స్వీకరించి ఇంటిలోని ఆడవారికి సహాయం చేయండి..'' అని క్రిష్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కనుక ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తే ఆ కిక్కు వేరేలా ఉంటుందని కొత్తగా చెప్పనవసరం లేదు కదా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa