సూర్య వరుస సినిమాలు చేస్తున్నాడు సుధ కొంగర సినిమాను పూర్తి చేసిన ఆయన, హరి దర్శకత్వంలో 'సింగం' సీక్వెల్ చేస్తున్నాడు.ఆ తరువాత శివ .. వెట్రిమారన్ .. లోకేశ్ కనగరాజ్ లను లైన్లో పెట్టేశాడు. విభిన్నమైన కథలతో విజయాలను అందుకున్న దర్శకులుగా ఈ ముగ్గురికి మంచి పేరుంది. ఈ సినిమాలన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా మొదలుకానున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు భారీ హిట్లు వచ్చాయి. ఇటీవలే గౌతమ్ మీనన్ వినిపించిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ నడుస్తుందట. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa