సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌గా తీరిగ్గా కూర్చుని మరీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడట. ఈ క్రమంలో ఓ పాటను రెడీ చేసి సుక్కు అండ్ బన్నిలకు వినిపించడం, వాళ్ళకు నచ్చడం, హ్యాపీగా ఫీలవడం కూడా జరిగిందట. దీంతో ఇప్పుడు ఐటం సాంగ్‌ను కంపో చేసే పనిలో ఉన్నాడట దేవీ. మరి సుక్కు- దేవీ కాంబినేషన్‌లో ఐటం సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా కోసం ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa