ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల్లయ్య అఘోరా ల కనిపిస్తాడు: బోయపాటి

cinema |  Suryaa Desk  | Published : Fri, May 01, 2020, 03:51 PM

దర్శకుడు బోయపాటి శ్రీను నిన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న చిత్ర విశేషాలు అడుగగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు . గతంలో బాలకృష్ణ గారితో నేను చేసిన సింహ, లెజెండ్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. మా హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్న నేపథ్యంలో సింహ. లెజెండ్ కి మించి ఈ చిత్రం ఉంటుంది అన్నారు.అలాగే బాలయ్య ఈ సినిమాలో ఓ పాత్రలో అఘోరా గా కనిపిస్తాడని, ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా అద్భుతమైన నేపథ్యంతో ఆ పాత్రకు ఉంటుంది అని ఆయన చెప్పుకు రావడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి చేశారట. కరోనా లాక్ డౌన్ అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుంది అన్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీంధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa