ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యావసర వస్తువులను అందించిన బాలకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Sat, May 02, 2020, 04:22 PM

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కోవిడ్ 19 సందర్భంగా ఇబ్బందులు పడుతున్న హౌస్ కీపింగ్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు, హాస్పిటల్ విధులలో ఉన్న దివ్యాంగులకు నందమూరి బాలకృష్ణ నిత్యావసర వస్తువులను అందజేశారు. సంస్థలో విధులు నిర్వహిస్తున్న వారందరూ అందిస్తున్న సేవలకు ప్రోత్సాహకంగా వాటిని అందజేస్తున్నట్లుగా బాలకృష్ణ తెలిపారు.  మొత్తం 400 మంది సిబ్బందికి 10 నుంచి 12 రోజులకు సరిపడా వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు చేస్తున్న స్కీనింగ్ పరీక్షలను ఆయన పరిశీలించారు. పలువురు పేషెంట్లను పరామర్శించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్లతో చర్చించి తగిన సూచనలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa