ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి దర్శకుడు కిషోర్ కుమార్ తో పవన్ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Sat, May 02, 2020, 05:41 PM

అభిమానులు దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గోపాలుడిగా, నిజజీవితంలో భక్తుడైన వెంకటేష్ నాస్తికుడైన గోపాల రావు పాత్రలో నటించిన క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’.పవన్ కళ్యాణ్  తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'వకీల్ సాబ్' సిద్ధమవుతోంది. ఇక క్రిష్ దర్శకత్వంలోను .. హరీశ్ శంకర్ దర్శకత్వంలోను చెరో సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని ఒక కథను పవన్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్ హీరోగా కిషోర్ కుమార్ పార్థసాని 'గోపాల గోపాల' .. 'కాటమరాయుడు' సినిమాలను తెరకెక్కించగా, 'గోపాల గోపాల'కి మంచి ఆదరణ లభించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు చేయనున్నది మూడో సినిమా అన్నమాట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa