అల వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అదే ఊపుతో తన తదుపరి చిత్రాన్ని భారీ స్థాయిలో చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోంది.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అర్జున్ లేకుండానే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఇందులో నివేదా థామస్ సెకండ్ హీరోయిన్ గా నటించనుందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఇందులో రెండవ హీరోయిన్ అంటూ ఎవరూ లేరని రష్మిక మాత్రమే హీరోయిన్ అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఓ టెర్రిఫిక్ ఫైట్‌ని సుకుమార్ ప్లాన్ చేశారట. 6 నిమిషాల నిడివితో సాగు ఈ ఫైట్‌ని నల్లమల అడవుల్లో హాలీవుడ్ స్థాయిలో షూట్ చేయాలనుకుంటున్నారట. దీని కోసం ఏకంగా 6 కోట్లు ఖర్చు చేసే అవకాశం వుందని తాజాగా వినిపిస్తోంది. అయితే ఈ ఫైట్ కోసం పలువురు హాలీవుడ్ ఫైట్ మాస్టర్లని తీసుకురావాలని ప్లాన్ చేశారట, కరోనా కారణంగా ఆ ప్లాన్ కాస్తా మారే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa