ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిక్స్ ప్యాక్ తో నాని...

cinema |  Suryaa Desk  | Published : Fri, May 08, 2020, 01:29 PM

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వి' ముస్తాబవుతోంది. ఆ తరువాత ఆయన శివ దర్శకత్వంలో 'టక్ జగదీశ్' సినిమాను పూర్తిచేయనున్నాడు. ఆ తరువాత రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' చేయనున్నాడు.  ఈ సినిమాలోనే నాని సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న నాని, సిక్స్ ప్యాక్  కోసం గట్టిగానే వర్కౌట్స్ చేస్తున్నాడని చెబుతున్నారు.చూస్తుంటే నాని ఈ సారి సాహసమే కాదు .. పెద్ద ప్రయోగం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి నటీనటులను ..సాంకేతిక నిపుణులను ఎంపిక చేసేశారట. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa