ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తండ్రి కమల్ హాసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతి...

cinema |  Suryaa Desk  | Published : Mon, May 11, 2020, 02:59 PM

తన తండ్రి, సినీ నటుడు కమలహాసన్‌ తనను ఎప్పుడూ తిట్టడం కానీ, అరవడం కానీ చేయలేదని హీరోయిన్ శ్రుతిహాసన్ చెప్పింది. తాజాగా ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో మాట్లాడింది.


మీ తండ్రి కమల్ ఎప్పుడైనా మీకు పనిష్మెంట్ ఇచ్చారా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ఆమె సమాధానం చెబుతూ, తనను ఆయన ఎన్నడూ కొట్టలేదని, తన తండ్రి అలా చేయరని పేర్కొంది. ప్రతి దానికి ఆయన వద్ద ఓ లాజిక్‌, కారణం ఉంటాయని తెలిపింది. ఒకసారి తాను ఓ తప్పుచేస్తే  తన తండ్రి తనతో చాలా నిరాశ చెందానని మాత్రమే అన్నారని చెప్పింది.


కాగా, కరోనా నేపథ్యంలో తన తండ్రి చెన్నైలోని ఇంట్లో క్వారంటైన్‌లో సంతోషంగా ఉన్నారని శ్రుతిహాసన్ చెప్పింది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక తాను మొదట పనికే ప్రాధాన్యమిస్తానని తెలిపింది. పనిని బాగా మిస్‌ అవుతున్నానని చెప్పింది. టాలీవుడ్‌లో ఆమె నటించిన గబ్బర్‌ సింగ్ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా దానిపై స్పందిస్తూ.. ఆ హిట్ సినిమాలో నటించడం నిజంగా తన అదృష్టమని చెప్పింది. తనకు సంబంధించిన చాలా విషయాల్లో ఆ సినిమా మార్పునకు కారణమైందని వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa