ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లూజర్' ట్రైలర్ వచ్చేసింది...

cinema |  Suryaa Desk  | Published : Mon, May 11, 2020, 05:59 PM

ఇప్పుడు ఎక్కడ విన్నా కరోనా కబుర్లు లేదా వెబ్ సీరిస్ వార్తలే. ముఖ్యంగా టీవి సీరియల్స్, సినిమాలు టింగ్ లు ఆగిపోయిన ఈ సమయంలో జనమంతా వెబ్ సీరిస్ ల మీద పడ్డారు. ముఖ్యంగా లాక్ డౌన్ నేపధ్యంలో సీరిస్ లు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో మల్లేశం సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి సైతం ఓ వెబ్ సీరిస్ తో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న లూసర్ అనే వెబ్ సీరిస్ అన్ని పనులు పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ రెడీ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ వారు జి 5 కోసం 'లూజర్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి .. శశాంక్ .. కల్పిక .. యాని .. ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 15వ తేదీ నుంచి జి 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముగ్గురు క్రీడాకారుల జీవితాలు ఏ కారణంగా ఎలాంటి మలుపులు తిరిగాయి? ఎలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురూ  కలుసుకున్నారు? ఆ తరువాత ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ నిర్మితమైంది. సహజత్వానికి దగ్గరగా పాత్రలను మలిచినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'ఓడిపోవడమంటే దారులు లేకపోవడం కాదు .. ఉన్న దారిని వెతుక్కోలేకపోవడం' .. ' పైసల విలువ ఎంత ఖర్చు పెడుతున్నామనే దాంట్లో వుండదురా .. ఎందుకు ఖర్చు పెడుతున్నామనేదాంట్లో ఉంటది' అనే డైలాగ్స్ బాగున్నాయి. ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa