కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం అంతా స్తంభించింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైయారు. మన దేశ విషయానికి వస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలోని డాక్టర్స్, పోలీసులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు పనిచేస్తున్నారు. కరోనాపై పోరుకు పలువురు ప్రముఖులు పలు రకాలుగా తమ వంతుగా సాయమందిస్తున్నారు. అటు బాలీవుడ్, ఇటు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సోనూసూద్ హెల్త్ వర్కర్లకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.సోనూసూద్ చేసిన పనిని చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు అది మరవక ముందే లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధిలేక చిక్కుకున్న వలస కార్మికులని స్వస్థలాలకు పంపడం క్ోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ప్రత్యేకమైన అనుమతులు తీసుకొని ఆయన ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించారు. సోమవారం ఈ బస్సులు ముంబాయిలోని థానేతోపాటు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలు దేరాయి. ఈ సందర్భంగా సోనూసూద్ థానేలోని బస్టాప్‌ల వద్దకు వచ్చి కార్మికులకు గుడ్ బై చెప్పాడు.మొత్తంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులు తమ కుటుంబ సభ్యులతో గడిపితే.. దేనితోనైనా పోరాడగలిగే శక్తి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అక్కడ అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చి సంచలనం రేపాడు. మరోవైపు అజయ్ దేవ్‌గణ్, వరుణ్ ధావన్,అమితాబ్, హృతిక్,విక్కీ కౌశల్ వంటి నటులు తమ వంతుగా సాయం చేసారు. అటు సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు సోనూ సూద్ కూడా తన వంతుగా హెల్త్ కేర్ వర్కర్స్ కోసం హోటల్ ఓపెన్ చేయడంతో పాటు తాజాగా ఇపుడు వలస కార్మికులను తరలించి తన ఉదారతను చాటుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa