ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత నాగచైతన్య పిక్ వైరల్..

cinema |  Suryaa Desk  | Published : Tue, May 12, 2020, 06:32 PM

సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. సమంత ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు సమంత ఓ రియాలిటీ షోకు జడ్జ్‌గా  చేయనున్నదని సమాచారం. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే సమంత, తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పెట్టింది. ఆ ఫోటోలో నాగ చైతన్యతో పాటు ఈ జంట పెంచుకుంటున్న కుక్క పిల్ల కూడా ఉంది. ఆ పోస్ట్‌లో సమంత రాస్తూ.. మీము ఓ గొప్ప సాహసయాత్రకు మేము సిద్ధమవుతున్నాం... దాదాపుగా.... అంటూ ఈ ముగ్గురు కలిసి ఓ కారులో కూర్చుకున్నారు. అయితే ఈ లాక్ డౌన్ వేళా.. ఈ జంట ఎక్కడికి పోతున్నారో అని తెగ అందోళన చెందుతున్నారు వీరి అభిమానులు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే సమంత పోస్ట్ చేసిన ఆ పిక్ పాతదట. అయితే ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలో ఈ ఫొటోకు 10 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. అంతేకాదు ఈ ఫొటోకు వందల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి జరుగాల్సీ వుంది కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇది కేవలం హారర్ చిత్రమే కాదనీ, అంతకు మించిన విషయమున్న చిత్రమని సమంత పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది రూపొందుతుంది. మరో వార్త ఏమంటే సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ తాజా సినిమా కన్నడ దియాకు రీమేక్‌గా వస్తోందట. కన్నడ సినిమా దియాను చూసిన సమంత ఆ రీమేక్‌లో నటించాలనీ కోరుకుంటుందట. నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa