మహానటి సినిమాతో ఫుల్ పాపులర్ అయిన కిర్తీ సురేశ్... సినిమాల విషయంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. 2020లో మాత్రం వరుస చిత్రాలతో సందడి చేయనుంది. దాదాపు అరడజను సినిమాలతో ఈ టాలెంటెడ్ బ్యూటీ ఆడియెన్స్ ముందుకు రానుంది త్వరలో కీర్తి సురేశ్ గ్లామర్ పాత్రలలో అందాలు ఆరబోయడానికి రెడీ అవుతోందనీ, అందుకే ఇటీవల డైటింగ్ చేసి బరువు తగ్గిందనీ వస్తున్న వార్తలను ఆ ముద్దుగుమ్మ ఖండించింది. 'నేను బరువు తగ్గింది కాస్త నాజూగ్గా కనపడడానికే తప్ప, ఎక్స్ పోజింగ్ పాత్రల్లో నటించడానికి కాదు.. ఆ ప్రచారాన్ని ఎంతమాత్రం నమ్మకండి' అంటూ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa