మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’కు సంబందించిన తెలుగు రీమేక్ రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమాను తెలుగులో బాలయ్య, రానా ప్రధాన పాత్రల్లో నిర్మించాలని భావించారు. అయితే ఏవో కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాలో నటించడంపై ఆసక్తి చూపించలేదట. దీంతో బాలయ్య పాత్రలో వెంకటేష్ ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తునట్లు తాజా సమాచారం. అంతేకాదు ఈ రీమేక్‌లో నటించడానికి ఇప్పటికే వెంకటేష్, రానాలు ఇంట్రస్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ గురించి మాట్లాడితే.. అయ్యప్పన్ కోషియమ్‌లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో వెంకటేష్ చేయనున్నాడు. పృథ్విరాజ్ పాత్రలో రానా నటిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలను, సినిమాలో పనిచేసే మిగితా టెక్నికల్ సిబ్బంది గురించి తెలుగు రీమేక్ హక్కులన నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం అతి త్వరలో వెల్లడించనున్నాడు. సూర్య దేవర నాగవంశీ ప్రస్తుతం రంగ్ దే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa