పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో వచ్చిన జ్యోతి లక్ష్మి సినిమాతో హీరోగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆ సినిమా తరువాత విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఇప్పుడు కన్నడలో సూపర్ హిట్ సాధించిన ఓ రీమేక్ చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు సత్యదేవ్. లవ్ మాక్ టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తుండగా అందులో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa