ఐదేళ్ల తర్వాత ఎక్స్ పైరీ డేట్ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇస్తోంది జూనియర్ ఐశ్వర్యారాయ్ అదేనండి స్నేహఉల్లాల్. హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా పరిచయమైన ఈ సొగసరి ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తర్వాత సింహా, కరెంట్ వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 2015 తర్వాత సినిమాలకు ఈ అమ్మడు దూరమైంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ‘ఎక్స్‌పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనుంది స్నేహాఉల్లాల్. స్నేహా ఉల్లాల్‌తో పాటు మధుశాలిని, టోనీ ల్యూక్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మార్తాండ్ కె.వెంకటేశ్ సోదరుడు శంకర్ కె.మార్తాండ్ డైరెక్టర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa