రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా మాళవిక అయ్యర్ కూడా నటిస్తోంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మించారు. అక్టోబర్ 2న 'ఆహా'లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. తన కెరీర్లో 90 శాతం రాజ్ తరుణ్ తో కలిసే నటించానని చెప్పింది. ఇప్పుడు ఇద్దరం కలిసే ఉంటున్నామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa