లాక్‌డౌన్ సమయంలో ఓటీటీల ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం `కరోనా వైరస్` పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `కరోనా వైరస్`ను వర్మ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని వర్మ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa