ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచిన్ తో దిగిన ఫోటోను పోస్టు చేసిన ప్రియా వారియర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2018, 02:34 PM

సోషల్ మీడియా సంచలనం ప్రియా వారియర్ టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తో సందడిచేసింది. కొచిలోని జవహర్‌ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఐఎస్‌ఎల్‌-2018కు మార్చి 1న విడుదల కానున్న  ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమా ప్రమోషన్ నిమిత్తం సహనటుడు రోషన్ అబ్దుల్ రహూఫ్ తో కలిసి ప్రియా వారియర్ హాజరైంది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మాస్టర్‌ బాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ లను కలిసింది. వారిని కలిసిన విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. కొచ్చికి రావడం వల్ల తాను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలుసుకున్నానని, చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కాగా,  ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాలో 'మాణిక్య మలరాయ పోవు' పాటలో భాగంగా ఆమె పలికించిన హావభావాలు యువతరానికి హత్తుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ గా మారింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa