కొంటెచూపుతో కుర్రకారుని గిలిగింతలు పెట్టిన సోగకళ్ళ చిన్నది ప్రియా ప్రకాశ్ వారియర్. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ప్రియా ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా అయ్యారు. మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్లో ప్రియా తన లవ్ ఎక్స్ ప్రెస్ చేసే విధానానికి బన్నీ కూడా ఫ్లాట్ అయ్యాడు. వెంటనే తన ట్విట్టర్ ఎకౌంట్లో వీడియోని షేర్ చేస్తూ.. ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియో చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది అంటూ కామెంట్ పెట్టాడు. బన్నీ కామెంట్స్ పై ఆనందం వ్యక్తం చేసింది మలయాళ కుట్టీ. అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ ని ఎప్పటికి మరచిపోలేను. అభిమానుల నుండి ఎంత స్పందన వచ్చిన, స్టైలిష్ స్టార్ కాంప్లిమెంట్ మాత్రం మరచిపోలేనిది. కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అని తెలిపింది ప్రియ.
ప్రియా వారియర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ని ఇప్పటి వరకు ఎంతో మంది ట్రై చేశారు. వాటికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ తన తనయుడితో ఈ యాక్ట్ ట్రై చేశాడు. ప్రియాలా మారిన అర్జున్ తన వేళ్ళకి ముద్దు పెట్టి , బల్లపై ఉన్న కుమారుడికి గురి పెట్టాడు. దీంతో వెంటనే అయాన్ టేబుల్ పై నుండి బెడ్ పైకి జంప్ చేశాడు. ఈ వీడియోని బన్నీ సతీమణి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగు అభిమానులే కాదు మలయాళీ అభిమానులు కూడా ఈ క్యూట్ వీడియోని వైరల్ చేశారు. బన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య చిత్రం చేస్తుండగా, ఈ మూవీ మే 4న తెలుగు, మలయాళ భాషలలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa