ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ జోడీగా మెహ్రీన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 03, 2018, 10:37 AM

తెలుగు తెరపై గ్లామర్ కథానాయికగా మెహ్రీన్ మంచి మార్కులు సంపాదించుకుంది. 'రాజా ది గ్రేట్' తరువాత ఈ సుందరి చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో అవకాశాలు అంతగా పలకరించడంలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ లభించడం అమ్మడి కెరియర్ కి బాగా కలిసొచ్చే అంశమని అంటున్నారు.తెలుగు ప్రేక్షకుల ముందుకు 'టాక్సీవాలా' .. 'ఏ మంత్రం వేశావే' లతో రానున్న విజయ్ దేవరకొండ, తమిళంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పాత్ర పరంగా విజయ్ దేవరకొండ జోడీగా మెహ్రీన్ అయితే బాగుంటుందని భావించి ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలకానుంది.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa