ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రోల్ చేసిన నెటిజన్‏కు అదిరిపోయే కౌంటర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 08, 2021, 09:45 AM

యాంకర్‏గానే కాకుండా అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. బుల్లితెరతోపాటు, వెండితెరపై కూడా తన విభిన్న పాత్రల్లో తన టాలెంట్ చూపిస్తుంది ఈ జబర్ధస్త్ బ్యూటీ. సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడు యాక్టీ్వ్‏గానే ఉంటుంది. అయితే ఆమె చేసే కొన్ని పోస్టులను కొందరు ట్రోల్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీటిని పట్టించుకోకున్న.. మరికొన్ని సందర్భాల్లో అనసూయ తనదైన స్టైల్లో వారికి సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా మరోసారి తనను ట్రోల్ చేసిన నెటిజన్‏కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది ఈ అమ్మడు.


తాజాగా ఓ నెటిజన్ అనసూయ మూడేళ్ళ కిందటి ఫోటోను షేర్ చేస్తూ.. ఆమెను ఇష్టానుసారంగా దూషించాడు. అనసూయ అందరి అటెన్షన్ కోసం ఇలా చేస్తుందంటూ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ పై అనసూయ స్పందించింది. ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొవి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నాకు లో బీపీ వచ్చింది. ఈ సంఘటన ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జరిగింది. పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయకు. 22 గంటలు విరామం లేకుండా పనిచేయడం వలన నాకు కళ్లు తిరిగాయి. అంతేకానీ నువ్వు చెప్పిన కారణాలు ఏమి నిజంకావు అంటూ నెటిజన్‏కు గట్టిగానే బదులిచ్చింది అనసూయ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa