శ్రీదేవి బయాపిక్ పై స్పందించిన వర్మ.విఖ్యాత నటి, తొలి సూపర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణం దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను కలిచి వేసింది. శ్రీదేవిని దేవతగా భావించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు. శ్రీదేవి గురించి, ఆమెతో తన అనుబంధం గురించి వరుస ట్వీట్లు చేశారు. ఆమె అనుమానాస్పద మృతి పట్ల కూడా ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించే యోచనలో కూడా వర్మ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై వర్మ ట్వీట్ చేసి స్పష్టం ఇచ్చారు. శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించే ఆలోచన తనకు లేదని తెలిపారు. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు. `నేను శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నానంటూ ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావు. అసలు ఆ ప్రయత్నం చేయడమే అవివేకం. ఎందుకంటే శ్రీదేవిలా నటించగల నటి ఒక్కరు కూడా లేర`ని వర్మ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa