ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచె క‌ట్టులో సూప‌ర్ స్టార్ అదుర్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 12:42 PM

పంచె క‌ట్టులో సూప‌ర్ స్టార్ అదుర్స్..సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం భరత్‌ అనే నేను. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ ఇప్పటికే విడుదలై, రికార్డు స్థాయి వ్యూస్‌ను రాబట్టుకుంది. కాగా ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ చిత్రంలో సంప్రాదయబద్దంగా పంచె కట్టుతో ఉన్న మహేష్‌బాబు పోస్టర్‌ను విడుదలచేశారు. దీనికి కూడా ప్రేక్షాకాభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.


మన తెలుగు సంవత్సరాది పండుగ కళ ఉట్టిపడే పంచె కట్టుతో ఉన్న భరత్‌ అనే నేను చిత్రంలోని మహేష్‌ పోస్టర్‌ను ఆదివారం విడుదలచేశా మని, ఈ లుక్‌ ప్రేక్షకాభిమానులను కనువిందు చేస్తోందని నిర్మాత దానయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫాటను రాజు సుందరం నేతృత్వంలో చిత్రీకరిస్తున్నామని ఆయన తెలిపారు. టెంపుల్‌ సెట్‌లో వందమందికి పైగా డ్యాన్సర్లు, వెయ్యిమందికి పైగా జూనియర్‌ ఆర్టి స్టులతో భారీ ఎత్తున ఈ పాటను తీస్తున్నామని ఆయన వివరించారు. ఈ నెల 25 నుంచి స్పెయిన్‌ షెడ్యూల్‌ ఉంటుందని, మిగిలిన అన్ని కార్యక్రమా లను పూర్తిచేసి, ఏప్రిల్‌ 20న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. మహే ష్‌బాబు సరసన కైరా అద్వాని నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపా త్రల్లో ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa